AP News: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ‘ఎంపీపీ’.. ఎన్నికకు తెదేపా దూరం
eenadu telugu news
Updated : 24/09/2021 12:43 IST

AP News: ఉత్కంఠ రేపుతున్న దుగ్గిరాల ‘ఎంపీపీ’.. ఎన్నికకు తెదేపా దూరం

దుగ్గిరాల: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న గుంటూరు జిల్లా  దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకుకోవాలని అధికార వైకాపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మండలంలో తెదేపా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది. అయితే ఆ పార్టీ ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీనాకు కుల ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో తెదేపా ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

దుగ్గిరాల మండలంలో అధికార వైకాపాకు 8, జనసేనకు 1, తెదేపాకు 9 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఎంపీపీ ఎన్నిక జరగాలంటే కనీసం 9 మంది ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. తెదేపా సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికకు జనసేన ఎంపీటీసీ సభ్యుడి ఓటు కీలకం కానుంది. జనసేన సభ్యుడు గైర్హాజరైతే ఎంపీపీ ఎన్నిక వాయిదా పడే అవకాశముంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుగ్గిరాలలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో రాకపోకలను నిలిపేశారు. ఇద్దరు ఏఎస్పీలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని