అబ్దుల్‌ కలాం సేవలు ఎనలేనివి
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

అబ్దుల్‌ కలాం సేవలు ఎనలేనివి


విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీలు మోపిదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: యువత మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకొని దేశానికి తమ వంతు సేవలు అందించాలని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. పల్నాడురోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. గడియారం స్తంభం కూడలిలో రూ. 7 కోట్లతో నిర్మించనున్న జామియా మసీదు, అంజుమన్‌ దుకాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రవేత్తగా కలాం ఎన్నో అద్బుతాలు సృష్టించి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ దేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముస్లింల సంక్షేమానికి రూ.కోట్ల నిధులు కేటాయిస్తుందన్నారు. రూ. 7 కోట్లతో దుకాణ సముదాయం, మసీదు నిర్మాణం చేపట్టామన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గుంటూరు తూర్పు, వినుకొండ ఎమ్మెల్యేలు ముస్తాఫా, బొల్లా బ్రహ్మనాయుడు, సీఈవో హలీం బాషా, షేక్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షేక్‌ ఆషాబేగం, మైనార్టీ కార్పొరేషన్‌ షేక్‌ ఆసిఫ్‌, వినుకొండ, తెనాలి మున్సిపల్‌ ఛైర్మన్లు సప్తగిరి, ఖలీదా, యార్డు ఛైర్మన్‌ హనీఫ్‌, పార్టీ నేతలు ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. తొలుత పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని