‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి’


మాట్లాడుతున్న తెదేపా నేత జీవీ ఆంజనేయులు

వినుకొండ, వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఇంటా, బయట ఎండగట్టాలని తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆపార్టీ నాయకులను కోరారు. విఠంరాజుపల్లె సమీపంలోని ఆయన అతిథిగృహంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విసృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ కారణాలతో పేదలకు పింఛన్లు నిలిపేయడం అన్యాయమని వారికి అండగా నిలిచి పునరుద్ధరించే దాకా పోరాటం చేయాలని సూచించారు. గ్యాస్‌, పెట్రోలు, ఎరువుల ధరలు పెంచి ప్రజల నెత్తిన పెనుభారం మోపిన పాలకుల మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ట్రూఅప్‌ పేరుతో విద్యుత్తు బిల్లు బాదుడుకు జేబులు ఖాళీ అవుతున్నాయని ఇది అధికార పార్టీ ప్రజలకు చేసిన అన్యాయమన్నారు. మూడేళ్లలోనే వైకాపా ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. పార్టీ శ్రేణులకు అండగా నిలిచి అధికార పార్టీ దౌర్జన్యాలను తిప్పికొట్టాలని కోరారు. విసృత సమావేశంలో ఆపార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పెదకంచర్ల గ్రామ తెదేపా అధ్యక్షునిగా పార్టీ అభివృద్ధికి కీలక పాత్ర పోషించిన బొబ్బాల శ్రీనివాసరావు మృతి తీర్చలేనిదని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని