నడికూడి మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

నడికూడి మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి


మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

దాచేపల్లి, న్యూస్‌టుడే : దాచేపల్లి వ్యాపార కూడలైన కొట్ల బజారులో రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన నగర పంచాయతీ పరిధిలోని పలు చోట్ల పర్యటించారు. ఆలయాలతో పాటు ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవీర్ల అంకమ్మతల్లికి పట్టు వస్త్రాలను బహుకరించారు. అనంతరం వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఆయన మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. 30 అడుగుల రోడ్డుతో పాటు మురుగు కాల్వలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వీధి దీపాల ఏర్పాటు, మొక్కలు నాటి వాటి పెంపకం పనులు కూడా చేయనున్నట్లు వివరించారు. దీనికి వ్యాపార వర్గాలంతా సహకరించాలని కోరారు. త్వరలో అందరినీ సమావేశపరచనున్నట్లు చెప్పారు. గుంటూరుకు దీటుగా నడికూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో రూ.10 కోట్లతో సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.9 కోట్లతో ఇంటింటికీ తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్‌ చైర్‌పర్సన్‌ దేవెండ్ల రేవతి, ఎంపీపీ కటకం జయశ్రీ, జడ్పీటీసీ సభ్యురాలు మూలగొండ్ల కృష్ణకుమారితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని