ద్విచక్ర వాహనం దగ్ధం
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

ద్విచక్ర వాహనం దగ్ధం


రోడ్డుపై తగలబడుతున్న వాహనం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్‌ అబ్దుల్‌ కలాం విగ్రహం సమీపంలో శుక్రవారం బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనం(స్కూటీ) విద్యుదాఘాతానికి గురై దగ్థమైంది. ఓ వ్యక్తి వాహనాన్ని నడుపుతున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తి ఒక్కసారిగా మంటలు రావటంతో భయందోళనకు గురయ్యాడు. వాహనాన్ని వదిలి పరుగులు తీశాడు. దిచక్ర వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దాని విలువ రూ.65 వేలు ఉంటుందని తెలిపారు. షోరూంనకు సంబంధించి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని డెమో నిమిత్తం నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని