ఆస్తి కోసం చంపేశారయ్యా..
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

ఆస్తి కోసం చంపేశారయ్యా..


నరసరావుపేట ఆర్డీవో శేషిరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న వృద్ధురాలు  

 నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: తన పేరిటనున్న భూముల ధరలు రూ.కోట్లు పలకడంతో బంధువులు ఆస్తిపై కన్నేశారు.. తాను బతికి ఉన్నా గాని, చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నారని నరసరావుపేటకు చెందిన ఓ వృద్ధురాలు(90) అధికారుల ముందు ఆవేదన వెలిబుచ్చింది. మండలంలోని ఇసప్పాలేనికి చెందిన బండ్లమూరి వెంకాయమ్మ సోమవారం ఆర్డీవో శేషిరెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. తన పేరుతో ఉన్న  రూ.20 కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల భూమిని కాజేసేందుకు సొంత బంధువైన బండ్లమూరి కోటయ్య ఆయన కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని పేర్కొంది. తాను జీవించి ఉన్నా చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, ఆస్తిని వారి పేరుతో మార్చుకుని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్డీవోకు వివరించింది. రిజిస్ట్రార్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు, సిబ్బంది ముడుపులు తీసుకుని అతనికి సహకరించారని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. మరణ ధ్రువపత్రం పుట్టించి భూములు అమ్మకానికి పెట్టడంతో అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని