అనుమతులు రాగానే వరికపూడిశెల నిర్మాణం
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

అనుమతులు రాగానే వరికపూడిశెల నిర్మాణం


నమూనా చెక్కు అందజేస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

బొల్లాపల్లి(వినుకొండ), న్యూస్‌టుడే : వరికపూడిశెల ప్రాజెక్టుకు రాష్ట్రం రూ.1200 కోట్లు కేటాయించిందని, కేంద్రం నుంచి అటవీ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మండల కేంద్రం బొల్లాపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూమి అవసరమైనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వివరాలు పంపినట్లు చెప్పారు. ఆసరా, అమ్మఒడి ఇతర పథకాల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పిల్లల చదువులు, స్వయం ఉపాధికి సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మూగచింతలపాలెం సాగర్‌ కుడి కాల్వ డీప్‌ కట్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా బొల్లాపల్లి చెరువుకు నీరందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తొలుత అంగన్‌వాడీ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బత్తి రాములు, జడ్పీటీసీ సభ్యురాలు రామావత్‌బాయి, ఎంపీటీసీ సభ్యురాలు మరియమ్మ, సర్పంచి జోత్స్న, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పద్మబాయి, తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని