ప్రమాదం అంచున పర్యాటకులు
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

ప్రమాదం అంచున పర్యాటకులు

నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్‌ క్రస్ట్‌ గేట్ల నుంచి కృష్ణమ్మ పరవళ్లు వీక్షించేందుకు డ్యాం ముందు భాగంలో ప్రధాన రహదారిలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ రహదారి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. డ్యాం ముందరి భాగంలో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించిన పలువురు గాయాలపాలయ్యారు. పాతవంతెన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు రహదారి పక్కన పెద్దపెద్ద బండరాళ్లు సైతం జారిపోయాయి. రహదారి పక్కన గేట్లు తిలకించే ప్రాంతంలో ఎటువంటి రక్షణ లేదు. పట్టించుకోవాల్సిన జలవనరులశాఖ   అధికారులు ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. రహదారి పక్కన చిన్నపాటి రక్షణగోడ అయినా నిర్మిస్తే ప్రమాదాల నుంచి పర్యాటకులను కాపాడవచ్చు.
- న్యూస్‌టుడే, మాచర్ల  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని