‘కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు’
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

‘కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు’

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి, తమిళనాడు ఇన్‌ఛార్జి డాక్టర్‌ సిరివెళ్ల ప్రసాదు అన్నారు. బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని విజయవాడ వెళుతూ సోమవారం ఆయన నరసరావుపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, దళిత, మైనార్టీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. పీసీసీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందన్నారు. నరసరావుపేట డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ సుధాకర్‌, పార్టీ నేతలు భాషా, శ్రీనివాస్‌, ఇమ్మానియేలు, ప్రవీణ్‌, కొండలు, మోహన్‌, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని