బాలుని హత్య కేసులో నిందితుని అరెస్టు
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

బాలుని హత్య కేసులో నిందితుని అరెస్టు

గుంటుపాలెం (శావల్యాపురం), న్యూస్‌టుడే : మండలంలోని వయ్యకల్లులో గత నెల 27న జరిగిన బాలుడు (17) హత్య కేసులో నిందితుడైన మరో బాలున్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూరల్‌ సీఐ బి.అశోక్‌కుమార్‌ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న స్థానిక ఎస్సీకాలనీకి చెందిన దారా రమేష్‌ సమీపంలోని పంట కాల్వలో చనిపోయి ఉండగా పోలీసులు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం పంపారు. నివేదికలో రమేష్‌ హత్యకు గురైనట్లు తేలింది. అతని తండ్రి దారా ప్రసాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా గ్రామానికి పక్కనే ఉన్న గుంటుపాలేనికి చెందిన మరో బాలుడు (17), రమేష్‌ డోజర్‌ డ్రైవర్లుగా పని చేసేవారు. వీరికి డోజరు అద్దె డబ్బుల విషయమై బేధాభిప్రాయాలు వచ్చాయి. గత నెల 26న ఇద్దరూ కాలనీకి సమీపంలోని పంట కాల్వ వద్ద మద్యం తాగారు. గొడవ మనసులో పెట్టుకున్న బాలుడు ఆ సమయంలో రమేష్‌ గొంతు నులిమి హత్య చేసి పంట కాల్వలో పడేశాడు. నిందితున్ని అరెస్ట్‌ చేసి వినుకొండ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ నిమిత్తం గుంటూరు జూవనైల్‌ హోమ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో స్థానిక ఎస్సై దాసరి శివనాగరాజు, ఈపూరు ఎస్సై విప్పర్ల వెంకట్రావు కృషి చేశారని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని