అర్జీలపై స్పందించండి
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

అర్జీలపై స్పందించండి


సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ‘స్పందన’ అర్జీలను నిర్దేశించిన సమయం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం ‘స్పందన’ కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌తో పాటు జేసీలు దినేష్‌కుమార్‌, రాజకుమారి, శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో కొండయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌ అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

అర్హులకు పదోన్నతి కల్పించండి
గ్రామ రెవెన్యూ సహాయకుల్లో అర్హులైన వారిని రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్‌, అటెండర్‌లుగా పదోన్నతి కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు ‘స్పందన’లో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభాకరరావు, జి.రోశయ్య, నాయకులు జె.శామ్యూల్‌జాన్‌, షేక్‌ నాగుల్‌మీరావలి తదితరులు వినతిపత్రం అందించారు. వీఆర్‌ఏలకు పదోన్నతి ఇవ్వాలని జీవోలు ఉన్నాయని, వాటిని అమలు చేయాలని కోరారు. గతంలోనే కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా గురజాల డివిజన్‌లో మాత్రమే పదోన్నతులు ఇచ్చారని, గుంటూరు, తెనాలి, నరసరావుపేట డివిజన్‌లలో పదోన్నతులు కల్పించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీఆర్‌ఏలతో వాచ్‌మెన్‌, అటెండర్‌ విధులు చేయించడాన్ని నిలిపివేయాలని కోరారు.

నా భర్త ఆచూకీ తెలపండి
తన భర్త కానిస్టేబుల్‌ లీలాకృష్ణ ఆచూకీ తెలపాలని బండిరెడ్డి నవ్యశ్రీ సోమవారం కలెక్టరేట్‌లోని స్పందనలో వినతిపత్రం అందించారు. కానిస్టేబుల్‌ కాంతకుమారి తన భర్తపై ప్రత్తిపాడుకు చెందిన పరమేశ్వరరావుతో కిడ్నాప్‌ కేసు పెట్ట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారించి తన భర్తపై అక్రమంగా కిడ్నాప్‌ కేసు మోపి ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నవ్యశ్రీ అధికారులను కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని