ఎయిడెడ్‌ కళాశాల ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

ఎయిడెడ్‌ కళాశాల ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

నరసరావుపేట పట్టణం: ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుందా ప్రసాద్‌ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన వెబ్‌ కౌన్సెలింగ్‌లో ప్రసాద్‌ను మాచర్లలోని ఎస్‌కేబీఆర్‌ కళాశాలకు కేటాయించారు. విధుల్లో చేరేందుకు అతను మాచర్ల వెళ్లగా యాజమాన్యం ఖాళీలు లేవని చెప్పటంతో వెనక్కి వచ్చాడు. రెండోసారి జరిగిన వెబ్‌ కౌన్సెలింగ్‌లో కాకినాడలోని ప్రభుత్వ మహిళా కళాశాలకు కేటాయించారు. ప్రసాద్‌ మూడు రోజుల క్రితం విధుల్లో చేరేందుకు కాకినాడ వెళ్లాడు. అక్కడ మూడు పోస్టులు ఖాళీగా ఉండగా ప్రసాద్‌తో పాటు మరో నలుగురు అభ్యర్థులు వచ్చారు. దీంతో కాకినాడలోనూ విధుల్లో చేరకపోవడంతో ఆదివారం రాత్రి నరసరావుపేట చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మనోవేదనకు గురైన ప్రసాద్‌ తన నివాసంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రెండుచోట్ల విధుల్లో చేరలేని పరిస్థితి ఎదురవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని