తెలుగు భాష గొప్పదనం చాటిన విశ్వనాథ
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

తెలుగు భాష గొప్పదనం చాటిన విశ్వనాథ


మాట్లాడుతున్న రావూరి నరసింహారావు

బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే : తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్న గొప్ప కవి విశ్వనాథ సత్యనారాయణ అని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహారావు పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమం బాపట్లలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీమద్‌ రామాయణ కల్పవృక్షం, కిన్నెరసాని, ఏకవీర, వేయిపడగలు వంటి ఎన్నో గొప్ప రచనలు చేసి కవి సామ్రాట్‌ బిరుదు పొందారన్నారు. సుమారు 30 కావ్యాలు, 58 నవలలు, ఆరు శతకాలు, 15 నాటకాలు, 10 గేయ కావ్యాలను సత్యనారాయణ రచించారని వివరించారు. కార్యక్రమంలో సంస్థ కోశాధికారి ఆదాంషఫీ, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, అహ్మద్, బొడ్డుపల్లి శ్రీరామ చంద్రమూర్తి, రెంటా మురళి రాధా కృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, జాకబ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని