‘కరకట్టల తవ్వకాలతో ముంపు ముప్పు’
eenadu telugu news
Published : 19/10/2021 02:21 IST

‘కరకట్టల తవ్వకాలతో ముంపు ముప్పు’

బాపట్ల పట్టణం: ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజారావు ఆరోపించారు. కొండుభొట్లవారిపాలెం పరిధిలోని నల్లమడ వాగు కరకట్టను బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. కాలువ కరకట్టలను అక్రమార్కులు తవ్వడంతో బలహీనపడుతున్నాయన్నారు. ఇకనైనా తవ్వకాలు ఆపేయాలని, లేకుంటే వరదల సమయంలో గండి పడే ప్రమాదం ఉందన్నారు. గండిపడితే కట్ట పక్కనే ఉన్న గ్రామాలు నీట మునుగుతుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలువ కట్టలను బలపరచాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాదారులకు నాయకులు అండగా ఉండటం సరికాదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ప్రభాకరరావు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని