త్వరలో ఘాట్‌రోడ్డు రెండో దశ పనులు
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

త్వరలో ఘాట్‌రోడ్డు రెండో దశ పనులు

కొత్తగా రహదారి నిర్మించాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఆర్‌అండ్‌బీ

డీఈఈ రాజేంద్రనాయుడు, జేఈఈ జగదీష్‌

కొండవీడు (యడ్లపాడు), న్యూస్‌టుడే: కొండవీడు ఘాట్‌రోడ్డు రెండో దశ పనుల నిర్వహణకు అటవీశాఖ నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ అధికారులు మంగళవారం కొండవీడును సందర్శించారు. నూతనంగా నిర్మించనున్న ఘాట్‌రోడ్డు ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ డీఈఈ రాజేంద్రనాయుడు మాట్లాడుతూ 5.1 కి.మీ ఘాట్‌రోడ్డుకు కొనసాగింపుగా స్వాగత ద్వారం నుంచి చారిత్రక కట్టడాల వరకు రూ.11.50 కోట్ల వ్యయంతో 620 మీటర్ల పొడవున ఘాట్‌రోడ్డు పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులను నవంబర్‌ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీవైఆర్‌వో నరసింహారావు, ఫారెస్టు బీట్‌ అధికారి షేక్‌ అమీర్‌జానీభాషా పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని