బెదిరించి భూములు లాక్కుంటున్నారు : సీపీఎం
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

బెదిరించి భూములు లాక్కుంటున్నారు : సీపీఎం


యడవల్లిలో మాట్లాడుతున్న పి.మధు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేట మండలంలోని యడవల్లి వీకర్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ సొసైటీలోని దళిత, గిరిజన రైతులకు తక్కువ ధర చెల్లించి ప్రభుత్వం భూములు కాజేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. యడవల్లిలో సొసైటీలోని కొంతమంది రైతులతో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దళిత, గిరిజన రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ఇవ్వకపోగా, రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్య వివరిస్తానని తెలిపారు. ఎకరా రూ.50లక్షలు పలికే భూమికి మూడు ఎకరాలకు కలిపి రూ.25లక్షలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులతో బెదిరించి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళిత, గిరిజన రైతులకు కనీసం రూ.70 లక్షలు ఇవ్వాలన్నారు. రైతులకు తగిన పరిహారం అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. సీపీఎం నాయకులు వి.కృష్ణయ్య, జి.విజయకుమార్‌, బొల్లు శంకరరావు, పోపూరి సుబ్బారావు, వెంకటేశ్వర్లు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని