‘ఫ్యాన్‌కు ఓటేస్తే తిరగడం మానేసింది’
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

‘ఫ్యాన్‌కు ఓటేస్తే తిరగడం మానేసింది’


ధర్నా చేస్తున్న జీవీ ఆంజనేయులు, నేతలు

బొల్లాపల్లి (వినుకొండ) : పల్లెల్లో విద్యుత్తు కోతలపై తెదేపా భగ్గుమంది. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల విద్యుత్తు ఉప కేంద్రం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. విద్యుత్తు బిల్లుల భారం మోయలేమంటూ ఫ్యాన్లకు తాడు కట్టి ఉరి వేసుకున్నట్లు ప్రదర్శించారు. పార్టీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఫ్యాన్‌కు ఓటేస్తే విద్యుత్తు లేక అది తిరగడం మానేసిందని విమర్శించారు. వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా ఏడు గంటలు సరఫరా చేస్తామని జగన్‌ చెప్పిన మాట విని ఓటేస్తే, అధికారంలోకి రాగానే అర్ధరాత్రి రైతులకు పొలం వెళ్లక తప్పడం లేదన్నారు. ఆరు సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచింది చాలక ట్రూ అప్‌ పేరుతో బిల్లుల షాక్‌కు జనం జేబులు కాలిపోతున్నాయని, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పిన జగనన్న ఇప్పుడు బిల్లులు కట్టలేదని ఫీజులు కనెక్షన్లు తొలగిస్తున్నారని విమర్శించారు. నేతలు పెమ్మసాని నాగేశ్వరావు, గోవిందనాయక్‌, కోటనాయక్‌, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని