కంచరగుంట వాసికి జాతీయ పురస్కారం
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

కంచరగుంట వాసికి జాతీయ పురస్కారం


అవార్డు అందుకుంటున్న వెంకటేశ్వర్లు

దుర్గి, న్యూస్‌టుడే : మండల పరిధిలోని కంచగుంటకు చెందిన వేముల వెంకటేశ్వర్లుకు (మాచర్ల ఆపిల్‌ పాఠశాల అధినేత) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం 90వ జయంతి పురస్కరించుకుని లీడ్‌ ఇండియా సంస్థ 2021-22 సంవత్సరానికి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో 18న వేముల వెంకటేశ్వర్లును సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సమక్షంలో పురస్కార పత్రం, జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించారు. 2006లో ఆయన దుర్గిలో ఓ పూరి గుడిసెలో చిన్న పాఠశాలను ఏర్పాటు చేసి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, అంచెలంచెలుగా ఎదిగారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ తురకా కిషోర్‌, దుర్గి ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్‌ ఆయనను అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని