నేడు కలెక్టరేట్‌లో మనం- మన పరిశుభ్రత
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

నేడు కలెక్టరేట్‌లో మనం- మన పరిశుభ్రత

గుంటూరు: జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనం, మన పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేసినట్లు జిల్లాపరిషత్తు సీఈవో చైతన్య తెలిపారు. ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. చెత్త సేకరణకు ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఆటోలను ఇన్‌ఛార్జి మంత్రి ప్రారంభించిన తర్వాత ఆయా గ్రామ పంచాయతీలకు తీసుకెళతారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని