కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


ప్రతిభ చూపిన విద్యార్థులతో శిక్షకులు

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని న్యూషావోలిన్‌ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులు కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 17న విజయవాడలో జరిగిన సాయి సెల్ఫ్‌డిఫెన్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించారు. దీనిలో అకాడమీకి చెందిన 10 మంది విద్యార్థులకు బంగారు, రజత పతకాలు సాధించారు. ప్రతిభచూపిన విద్యార్థులను సీఆర్‌ క్లబ్‌లోని శిక్షణ కేంద్రంలో మంగళవారం శిక్షకులు అభినందించారు. డిసెంబరు 12న జాతీయస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలకు సంబంధించి బ్రోచర్‌ ఆవిష్కరించారు. బత్తుల విక్రమ్‌, సురేష్‌, నాగరాజు, దుర్గాప్రసాద్‌, రబ్బాని, రాహుల్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని