వైరస్‌ తెగులు.. అన్నదాత దిగులు
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

వైరస్‌ తెగులు.. అన్నదాత దిగులు

వట్టిచెరుకూరు మండలంలోని చింతపల్లిపాడుకు చెందిన రైతు మన్నవ వంశీకృష్ణ 5.5 ఎకరాల్లో రెండు నెలలుగా మిర్చి పైరు సాగు చేశారు. పూత దశకు వచ్చిన తర్వాత వైరస్‌ తెగులు ఆశించి పనికి రాకుండా పోయింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. బరువైన మనసుతో బుధవారం కూలీని పెట్టించి ట్రాక్టర్‌తో పైరును తొక్కించారు. ఎన్ని సంరక్షణ చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యామర్రు గ్రామంలోనూ ఈ వైరస్‌ సోకడంతో మరికొందరు కర్షకులు మిర్చి పంటను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. - న్యూస్‌టుడే, వట్టిచెరుకూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని