స్వచ్ఛ సంకల్పం ప్రారంభం
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

స్వచ్ఛ సంకల్పం ప్రారంభం


చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీలు మోపిదేవి

వెంకటరమణరావు, అయోధ్య రామిరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌

గుంటూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జెండా ఊపి హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ చెత్తసేకరణకు ప్రతీ ఇంటి నుంచి రోజుకు రూ.2 చొప్పున 585 గ్రామాల్లోని కుటుంబాల నుంచి రూ.162 కోట్ల ఆదాయ సేకరణ జరుగుతుందన్నారు. వాటితో గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు. చెత్తను కాల్చివేసేందుకు 709 పరికరాలను, 98 ఫాగింగ్‌ యంత్రాలు, అధిక పీడన టాయిలెట్‌ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు, ఎమ్మెల్సీ కల్పలత, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, ముస్తఫా, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ చంద్రగిరి యేసురత్నం, నగరపాలక సంస్థ మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ సజీల, డీపీవో కేశవరెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని