విధులకు బయల్దేరి.. ప్రమాదానికి గురై
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

విధులకు బయల్దేరి.. ప్రమాదానికి గురై


వల్లంశెట్టి శ్రీనివాసరావు 

రాజుపాలెం, కారంపూడి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒక ప్రధానోపాధ్యాయుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కారంపూడి మండలం ఒప్పిచర్ల, పెదకొదమగుండ్ల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వల్లంశెట్టి శ్రీనివాసరావు, కాకరపర్తి శ్రీనివాసరావులు సత్తెనపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై విధులకు బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం అనుపాలెం సమీపంలోని బెల్లంకొండ బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బెల్లంకొండకు చెందిన కారు ఢీకొంది. సంఘటనలో ఇద్దరికీ కాళ్లు విరిగి తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకొన్న ఎస్సై కలగొట్ల అమీర్‌ సిబ్బందితో అక్కడకు చేరుకొని వారిని సత్తెనపల్లి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ వల్లంసెట్టి శ్రీనివాసురావు మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంఈవోగా శ్రీనివాసరావుకు పదోన్నతి వచ్చినా విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్న కాంక్షతో ఒప్పిచర్ల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూ పలువురి ప్రశంసలు అందుకున్నారు. భార్య ధనలక్ష్మి క్రోసూరు మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెదకొదమగుండ్ల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కాకరపర్తి శ్రీనివాసరావుకు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురి ప్రశంసలందుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని