స్తంభాలగరువులో భారీ చోరీ
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

స్తంభాలగరువులో భారీ చోరీ

70 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ

గుంటూరు, న్యూస్‌టుడే: స్తంభాలగరువులో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటున్న భవనం వీరారెడ్డి స్తంభాలగరువులో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఒక పడక గదిలో నిద్రిస్తున్నారు. దొంగలు బూజు దులిపే పెద్ద కర్రతో కిటికీలో నుంచి తలుపు గడియ తొలగించి లోపలకు ప్రవేశించారు. మరో పడక గదిలో ఉన్న బీరువాలోని 70 సవర్ల బంగారు ఆభరణాలను, రూ.20,000 నగదు అపహరిచారు. బుధవారం నిద్ర మేల్కొన వీరారెడ్డి పడక గదిలో వస్తువులన్నీ బెడ్‌పై చిందర వందరగా పడి ఉండటం, బీరువా లాకర్‌ తెరచి ఉండటం గమనించి దొంగతనం జరిగిందని గ్రహించారు. పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని