నూరుశాతం స్వచ్ఛ సంకల్పమే లక్ష్యం
eenadu telugu news
Published : 21/10/2021 03:46 IST

నూరుశాతం స్వచ్ఛ సంకల్పమే లక్ష్యం


ప్రదర్శనలో ఎంపీపీ రాణి, జడ్పీటీసీ మస్తానరావు తదితరులు

చిలకలూరిపేట గ్రామీణ, నాదెండ్ల: గ్రామాల్లో నూరుశాతం స్వచ్ఛ సంకల్పం సాధించాలని ఎంపీపీ దేవినేని శంకరరావు కోరారు. మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు కోడె సుధారాణి, స్వచ్ఛ సంకల్పం మండల ప్రత్యేకాధారి మస్తాన్‌ షరీఫ్‌, ఎంపీడీవో హేమలతాదేవి పాల్గొన్నారు. స్వచ్ఛ సంకల్పం గోడపత్రిక ఆవిష్కరించారు.నాదెండ్ల మండల స్థాయిలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని మండల పరిషత్తు కార్యాలయం వద్ద ఎంపీపీ రాణి, జడ్పీటీసీ మస్తానరావు బుధవారం ప్రారంభించారు. ప్రత్యేకాధికారి బీజే.బెన్నీ, ఇన్‌ఛార్జి ఎంపీడీవో మోషే, ఎంపీటీసీలు, సర్పంచులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

దాచేపల్లి: గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఎంపీడీవో మహాలక్ష్మి కోరారు. బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మండల పరిషత్‌ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈవోపీఆర్డీ మరియాదేవి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కందుల జాను, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

యడ్లపాడు, న్యూస్‌టుడే: స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దటానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పిడతల ఝాన్సీ అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. జడ్పీటీసీ సభ్యుడు ముక్తా వాసు, ఎంపీడీవో మాధురి, ఈవోపీర్డీ శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి కె.రాధారాణి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రొంపిచర్ల: జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా గ్రామాల పరిశుభ్రతకు శ్రీకారం చుట్టిందని ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు, స్వచ్ఛ సంకల్పంపై సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో అర్జునరావు, వైస్‌ ఎంపీపీ మాధవి తదితరులు స్వచ్ఛ సంకల్పం ఉద్దేశాన్ని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని