అర్హులకు పట్టాలు మంజూరు చేయండి
eenadu telugu news
Published : 21/10/2021 03:46 IST

అర్హులకు పట్టాలు మంజూరు చేయండి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారికి నిబంధనల ప్రకారం పట్టాలను జారీ చేసేందుకు గ్రామ స్థాయిలో అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభలో తీర్మానాలు చేయాలన్నారు. సబ్‌డివిజన్‌ స్థాయి కమిటీ ఆమోదించి జిల్లా స్థాయికి అర్హుల జాబితాను పంపేందుకు అనుబంధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. మాదిపాడులో సత్తెమ్మ తల్లి అమ్మవారి ఏకో పార్కు పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బెల్లంకొండ శ్రీరామాంజనేయపురంలో నివసిస్తున్న గిరిజనులకు అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, అంతర్గత రహదారుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపునకు విద్య, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని