వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట

ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు


రైతులకు నమూనా చెక్కును అందజేస్తున్న ఎంపీలు వెంకటరమణారావు,

అయోధ్యరామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా, జేసీ దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌రావు, కిలారి రోశయ్య, నంబూరు శంకరరావు హాజరయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, యంత్రసేవా పథకాలకు సంబంధించిన నగదు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వీక్షించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ పనులు ప్రారంభం నుంచి ఉత్పత్తుల విక్రయాల వరకు సలహాలు ఇవ్వడంతో పాటు, రైతులకు ఆర్థిక భరోసా కోసం రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. కొవిడ్‌ విపత్కర సమయంలోనూ అన్ని రకాల పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. జిల్లాలో రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ కింద 4,43,082 మంది రైతులకు రూ.177.23 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా 38,807 మంది రైతులకు రూ.8.43 కోట్లు, సున్నా వడ్డీ రాయితీని వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా 123 రైతు బృందాలకు రూ.124.84 లక్షల సబ్సిడీని అందించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేయడం కోసమే రైతులకు అన్ని విధాలుగా సహాయ, సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మెప్మా, యూనిసెఫ్‌ సంయుక్తంగా కొవిడ్‌ ప్రతి స్పందన, రుతు పరిశుభ్రత నిర్వహణకు 13 మున్సిపాలిటీల్లోని ఆర్పీలు, ఎంఈసీసీఎస్‌లు, హెచ్‌ఆర్‌పీలకు హైజీన్‌ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ కె.శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఎం.విజయభారతి, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని