పీహెచ్‌సీల నిర్మాణానికి స్థల సేకరణ
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

పీహెచ్‌సీల నిర్మాణానికి స్థల సేకరణ

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెంటనే స్థలాలను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు గీతా ప్రసాదిని మంగళవారం డీఎంహెచ్‌వోకు లేఖ రాశారు. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో కనీసం 1.5 ఎకరం భూమి తప్పకుండా ఉండేవిధంగా ప్రయత్నించాలని సూచించారు. రెవెన్యూ శాఖ సహకారంతో అవసరమైన భూమిని సేకరించాలని కోరారు. పీహెచ్‌సీ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని రహదారులు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరుకు అప్పగించాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు.

కొత్తగా మంజూరైనవి ఇవే..: మాదిపాడు (అచ్చంపేట), బెల్లంకొండ (బెల్లంకొండ), దొడ్లేరు (క్రోసూరు), వేజెండ్ల (చేబ్రోలు), గామాలపాడు (దాచేపల్లి), పిన్నెల్లి (మాచవరం), సొలస (యడ్లపాడు), పి.గొల్లపాలెం (కర్లపాలెం), ఐనవోలు (నూజెండ్ల), వేల్పూరు (శావల్యాపురం), ఉప్పలపాడు (పెదనందిపాడు), నెమలిపురి (రాజుపాలెం), గోలి (రెంటచింతల), మాదల (ముప్పాళ్ల), వడ్డేశ్వరం (తాడేపల్లి), లాం (తాడికొండ), మందడం (తుళ్లూరు), ఫిరంగిపురం (ఫిరంగిపురం), దోనెపూడి (కొల్లూరు).


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని