కంకణాలపల్లి మాజీ సర్పంచికి జైలు
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

కంకణాలపల్లి మాజీ సర్పంచికి జైలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారని సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి మాజీ సర్పంచి కె.సుబ్బారావుకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. కంకణాలపల్లి పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 2017 మార్చిలో విడుదలైన రూ. 8.86 లక్షలు మాజీ సర్పంచి ఉపసంహరించారు. మెటీరియల్‌ సమకూర్చిన ఉన్నం శ్రీనివాసరావు సంబంధిత నగదు చెల్లించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి కలెక్టరు, పంచాయతీరాజ్‌ డీఈఈ, సర్పంచి, పంచాయతీ కార్యదర్శిపైనా ఫిర్యాదు చేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన కోర్టు నగదు చెల్లించాలని అప్పటి సర్పంచి కె.సుబ్బారావును ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా నగదు చెల్లించలేదని శ్రీనివాసరావు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆదేశాలను ధిక్కరించారని కె.సుబ్బారావుకు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా, పంచాయతీ కార్యదర్శి సీహెచ్‌ శ్రీనివాసరావుకు రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని మాజీ సర్పంచి, పంచాయతీ కార్యదర్శికి న్యాయస్థానం కల్పించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని