జల్సాల కోసం సెల్‌టవర్లలో చోరీలు
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

జల్సాల కోసం సెల్‌టవర్లలో చోరీలు

18 బ్యాటరీలు, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: వాళ్లంతా యువకులు సెల్‌టవర్‌లలో టెక్నీషియన్‌లుగా పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడి జల్సాల కోసం తాము పనిచేసిన సెల్‌ టవర్లనే లక్ష్యంగా చేసుకున్నారు. విలువైన బ్యాటరీలు దొంగతనం చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జల్సాలు చేస్తున్నారు. మంగళవారం హెచ్‌ఎంపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశం జిల్లా కందుకూరు డీఎస్సీ కె.శ్రీనివాసరావు కేసు వివరాలను తెలిపారు. కంభం పట్టణానికి చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఇద్దరు, వినుకొండకు చెందిన ఒకరు బ్యాటరీల చోరీకి ముఠాగా ఏర్పడ్డారు. వారు పనిచేసిన ప్రాంతాల్లోని సెల్‌ టవర్ల నుంచి బ్యాటరీలు అపహరించేవారు. సెల్‌టవర్ల నిర్వాహకుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల ఎస్సైలను సీఐ పాపారావు ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ముఠా కదలికలపై నిఘా పెట్టారు. కంభానికి చెందిన ఎడమకంటి నాగేంద్ర, బాబా అనిల్‌, మీనుగ కాశయ్య, మాచర్లకు చెందిన కావూరి నాగవెంకట శేషు, వినుకొండకు చెందిన గంధం సురేష్‌, బొమ్మలాపురానికి చెందిన రామావత్‌ దుర్గానాయక్‌లను మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 18 బ్యాటరీలు, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ పాపారావు, హెచ్‌ఎంపాడు ఎస్సై కృష్ణపావని, వెలిగండ్ల ఎస్సై రాజ్‌కుమార్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని