ప్రాంగణ ఎంపికల్లో కిట్స్‌ విద్యార్థుల ప్రతిభ
eenadu telugu news
Published : 27/10/2021 05:49 IST

ప్రాంగణ ఎంపికల్లో కిట్స్‌ విద్యార్థుల ప్రతిభ


ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతో ఛైర్మన్‌ కోయిసుబ్బారావు, కార్యదర్శి కోయిశేఖర్‌ తదితరులు

వింజనంపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: మండలంలోని వింజనంపాడు కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విప్రో కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 161 మంది ఉద్యోగాలు సాధించినట్లు ప్రిన్సిపల్‌ పి.బాబు మంగళవారం తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 411 మంది ఉద్యోగాలు పొందారని, వీరిలో డీఎక్స్‌సీలో 140, టీసీఎస్‌కు 57, ఎంఫసిస్‌లో 43, హాక్‌విత్‌ఇన్ఫిలో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. ప్రాంగణ ఎంపికల్లో సత్తా చాటాలే ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు క్రమశిక్షణ, సామాజికసేవ వంటి కార్యక్రమాలను కళాశాలలో చేపడుతున్నట్లు కళాశాల కార్యదర్శి కోయి శేఖర్‌ అన్నారు. డైరెక్టర్‌ కె.హరిబాబు, ఉపాధి కల్పనాధికారి చంద్రశేఖరరెడ్డి ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని