విపత్తుల వేళ అప్రమత్తత తప్పనిసరి
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

విపత్తుల వేళ అప్రమత్తత తప్పనిసరి


మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా

నిజాంపట్నం, న్యూస్‌టుడే : తీరప్రాంత ప్రజలు ప్రకృతి విపత్తుల వేళ అప్రమత్తంగా ఉండాలని తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా సూచించారు. నిజాంపట్నం గ్రామ సచివాలయం-3లో బుధవారం జాతీయ విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి తహశీల్దారు జి.శ్రీనివాసు అధ్యక్షత వహించారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నవంబరు, డిసెంబరు నెలల్లో తుపాన్ల ప్రభావం ఉంటుందని, ఆయా సమయాల్లో తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తుపాను సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చేసి చూపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ లలిత, ఎంపీడీవో నాగలక్ష్మి, సర్పంచులు కట్టా పోలేరమ్మ, బెల్లంకొండ చిట్టిబాబు, వీఆర్వోలు మోపిదేవి వేణుగోపాల్‌, వరప్రసాద్‌, ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి స్వాతి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని