ఏఎన్‌యూలో క్రీడా పాఠశాల ప్రవేశ పోటీలు
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

ఏఎన్‌యూలో క్రీడా పాఠశాల ప్రవేశ పోటీలు

బ్రాడ్‌ జంప్‌ పోటీలో విద్యార్థి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: కడప క్రీడా పాఠాశాలలో 4, 5 తరగతుల్లో ప్రవేశాల కోసం బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జిల్లా స్థాయి ఎంపికల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం 4వ తరగతిలో చేరేవారి కోసం నిర్వహించిన పోటీల్లో 149 మంది పాల్గొన్నారు. గురువారం 5వ తరగతిలో చేరే వారి కోసం ఎంపికలుంటాయి. వీరికి ఎత్తు-బరువు, వర్టికల్‌ జంప్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌ 30, 800, 610 మీటర్ల పరుగు పందెం పోటీలు పెట్టారు. ఏఎన్‌యూ, శాప్‌ అధికారులు ఈ ప్రక్రయను పర్యవేక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని