నకిలీ పురుగు మందులు పట్టివేత
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

నకిలీ పురుగు మందులు పట్టివేత


ప్యాకెట్లను తనిఖీ చేస్తున్న అధికారులు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని పల్నాడు పార్సిల్‌ ఆఫీసులో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేసి నకిలీ ఎస్‌ఫేట్‌ మందు 50 కిలోలను బుధవారం రాత్రి పట్టుకున్నారు. వ్యవసాయశాఖ డీడీ రామాంజనేయులు, ఏడీఏలు పద్మావతి, శ్రీనివాసరావు, వ్యవసాయాధికారిణి స్రవంతి పార్శిల్‌ సర్వీసుకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ ప్రాంతం నుంచి పట్టణానికి చెందిన నరసింహారావు అనే వ్యాపారికి 50 కిలోల ఎస్‌ఫేట్‌ మందు ఐదు బాక్సుల్లో పార్శిల్‌ వచ్చింది. అధికారులు తెరిచి చూడగా ఆ కంపెనీ అసలు ఆంధ్రప్రదేశ్‌లో లేదని చెప్పారు. శాంపిల్‌ను ప్రయోగశాలకు పంపించి పరీక్షిస్తామని డీడీ రామాంజనేయులు తెలిపారు. పట్టుకున్న మందు విలువ రూ.43 వేలు ఉంటుందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని