చిన్న పరిశ్రమలకు బ్యాంకుల చేయూత
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

చిన్న పరిశ్రమలకు బ్యాంకుల చేయూత


రుణాల చెక్కును అందజేస్తున్న డీజీఎం రవికుమార్‌, అధికారులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు బ్యాంకులు చేయూతనిస్తున్నాయని లీడ్‌బ్యాంక్‌ కన్వీనర్‌, యూనియన్‌ బ్యాంకు డీజీఎం ఎ.రవికుమార్‌ పేర్కొన్నారు. జీటీ రోడ్డులోని ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌ హాలులో ముద్ర, స్టాండప్‌, పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ తదితర పథకాల్లోని ఎంఎస్‌ఎంఈ వ్యాపారులకు రుణాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యాపార సంస్థల వల్ల నిరుద్యోగులకు ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలిస్తున్నాయని వివరించారు. ఎంఎస్‌ఎంఈ వ్యాపారులకు రూ.56 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధి పథకాలను బ్యాంకులు ప్రొత్సహిస్తున్నాయని, రుణాలు పొందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సకాలంలో చెల్లించాలన్నారు. తద్వారా బ్యాంకులు ఎక్కువ మందికి రుణాలిచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏజీఎంలు గణేష్‌, తిలక్‌, ఎల్‌డీఎం ఈదర రాంబాబు, బ్యాంకు మేనేజర్లు ప్రసంగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని