ఎలుకల నివారణతో అధిక దిగుబడులు
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

ఎలుకల నివారణతో అధిక దిగుబడులు


ఎలుకల నివారణ మందు పంపిణీ చేస్తున్న జేడీఏ విజయభారతి తదితరులు

గ్రామీణ నరసరావుపేట, న్యూస్‌టుడే: వరిలో ఎలుకల నివారణతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీఏ విజయభారతి పేర్కొన్నారు. సామూహిక ఎలుకల నివారణలో భాగంగా బుధవారం పాలపాడులో ఉచితంగా మందు పంపిణీ చేశారు. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తూనీగలు పంటను నాశనం చేసే పురుగులను తింటాయన్నారు. అక్షింతల పురుగు వల్ల పంటకు మేలన్నారు. కిరణజన్య సంయోగక్రియ జరగకపోవటం వల్ల దిగుబడి సరిగా రాదన్నారు. ఎలుకల బెడదతో రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏలు హేమలత, వాణిశ్రీ, మస్తానమ్మ, సర్పంచి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని