‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో వెల్లువెత్తిన ఫిర్యాదులు
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో వెల్లువెత్తిన ఫిర్యాదులు


ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : బుధవారం జరిగిన ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి అందిన వినతుల పరిష్కారానికి రూరల్‌ ఎస్పీ అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అందిన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి..

దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తనకు పిల్లను ఇచ్చిన మామ అవసరాలకు అని తన వద్ద రూ.13 లక్షలు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే తనపై భార్య చేత కేసు పెట్టించాడని తెలిపాడు. స్పందించిన ఎస్పీ అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడితే వాళ్లు కూడా తమ విచారణలో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో ఎస్పీ వెంటనే ఆ తప్పుడు కేసును ఎత్తివేసి తిరిగి అతని మామయ్యపై 420 కేసు నమోదు చేయాలన్నారు. బాధితుడిని తన వద్ద ఉన్న ఆధారాలను సీఐకి ఇవ్వాలన్నారు.

 హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ దాచేపల్లి మండలం మాదిగపాడులోని తమ పొలాన్ని ఓ వ్యక్తి కౌలుకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. స్పందించిన ఎస్పీ అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

 రొంపిచర్లకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తనపై కొంతమంది దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్పుడు కేసుగా తీసివేశారని తెలిపారు. స్పందించిన ఎస్పీ విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని