‘బీసీ కులాల గణన చేయకపోతే ఉద్యమిస్తాం’
eenadu telugu news
Published : 28/10/2021 02:39 IST

‘బీసీ కులాల గణన చేయకపోతే ఉద్యమిస్తాం’


మాట్లాడుతున్న కేసన శంకరరావు

నిజాంపట్నం, న్యూస్‌టుడే : బీసీ కులాల గణన చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. నిజాంపట్నం వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ బీసీ వర్గాల భవిష్యత్తు అంతా కుల గణనపై ఆధారపడి ఉందని, అందువల్ల ఉద్యమం తీవ్రతరం చేయక తప్పదన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు బీసీ కులాల గణన అంటేనే హడలి పోతున్నాయని, కులాల వారీగా జనగణ చేస్తే బీసీల సంఖ్యాబలం బహిర్గతమవుతుందని, దీంతో తమ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయేమోనని భయపడుతున్నాయంటూ చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో సీట్ల కేటాయింపులో, సంక్షేమ పథకాలు అమలులో బీసీ కులాలపై కపటప్రేమను ప్రదర్శిస్తున్నాయని అన్నారు. సమావేశంలో సంఘ మండల అధ్యక్షుడు కొపనాతి నాగబాబు, రేపల్లె పట్టణ అధ్యక్షుడు పిన్నిబోయిన నాగవెంకట వెంకటేశ్వరరావు, దబ్బకూటి వెంకటేశ్వరరావు, పందరబోయిన గోపి, బీసీ నేతలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని