Crime News: ‘నా చేతిలో కత్తి, బ్లేడు ఉంది’.. తెనాలిలో పాతనేరస్థుడు హల్‌చల్
eenadu telugu news
Published : 28/10/2021 18:54 IST

Crime News: ‘నా చేతిలో కత్తి, బ్లేడు ఉంది’.. తెనాలిలో పాతనేరస్థుడు హల్‌చల్

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో పాతనేరస్థుడు భరత్ హల్ చల్ చేశాడు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తెనాలి ఐతానగర్‌లోని చెరువులో దిగాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కాసేపు హల్‌ చల్‌ సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఐతానగర్‌లోని పాత నేరస్థుడు మాతంగి భారత్‌ని దొంగతనం కేసులో అరెస్టు చేసేందుకు రెండో పట్టణ పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన భరత్ ఇంట్లో నుంచి పరారై.. ఐతానగర్‌లో ఉన్న చేపల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు తనను బయటకు తీసేందుకు వస్తే తన చేతిలో కత్తి, బ్లేడు ఉందని.. అరెస్టు చేయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరించాడు. మాతంగి భారత్‌పై గతంలో అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇదే భరత్ గతంలో గంజాయి తాగి హల్‌చల్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పుడు కూడా పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా ఇదే తరహాలో కాల్వలోకి దూకినట్లు చెప్పారు.

భరత్ మాట్లాడుతూ.. ‘‘బయటకి వచ్చి 15 రోజులు కూడా అవడం లేదు. మళ్ళీ నా మీద కేసులు ఉన్నాయని రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ఉదయం వచ్చారు. పోలీసులు చెప్పే కేసులకి, నాకు ఎటువంటి సంబంధం లేదు. దొంగతనం జరిగిన సమయంలో నేను అమరావతిలో ఉన్నాను. గతంలో నా మీద రెండో పట్టణ పోలీసులు 7 తప్పుడు కేసులు నమోదు చేశారు’’ అని భరత్‌ వాపోయాడు. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతే లాయర్‌ని తీసుకువచ్చి మాట్లాడతానని తెలపడంతో ఎట్టకేలకు పోలీసులు ఆ చెరువు దగ్గర నుంచి వెళ్లిపోయారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని