
హైదరాబాద్లో ప్రాణం తీసిన చాటింగ్ సరదా
శంషాబాద్: సెల్ఫోన్లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మూడంతస్తుల భవనం పైనుంచి పడి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ముదిలికి చెందిన సిమ్రాన్(20) శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది.
మంగళవారం సిమ్రాన్ తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనంపై చరవాణిలో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags :