close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

తాజా వార్తలు

2024 నాటికి భారత్‌ ఆర్థికంగా పరిపుష్టం

కాచిగూడ: 2024 నాటికి భారత్‌ ఆర్థికంగా పరిపుష్టి సాధించి అగ్రదేశాల సరసన నిలుస్తుందని భాజపా ఆర్థిక వ్యవహారాల జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని బద్రుకా కళాశాలలో ‘భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ-అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. మేకిన్‌ ఇండియా, జీఎస్టీ తదితర సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి మరింత ఊతమిస్తున్నాయన్నారు. డిజిటల్‌ నగదు లావాదేవీలతో పన్ను ఎగవేత తగ్గిపోయిందని పేర్కొన్నారు. సెరా-కెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ డైరెక్టర్‌ కేజీకే మూర్తి, డెలాయిట్‌ ఇండియా ఛైర్మన్‌ పీఆర్‌ రమేశ్‌ మాట్లాడారు. ముకుంద్‌లాల్‌ బద్రుకా, శ్రీకృష్ణ బద్రుకా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.