
పాతబస్తీలో తల్లీకుమార్తె దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో తల్లీ కుమార్తె దారుణహత్యకు గురయ్యారు. ఘాజీమిల్లత్ నల్లవాగులోని ఓ ఇంట్లో ఇవాళ తెల్లవారుజామున సాజితాబేగం(60), ఆమె కుమార్తె ఫరీదా బేగం(32)ను వారి సమీప బంధువు రెహమాన్ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఫరీదాబేగం భర్త దుబాయ్‌లో ఉంటున్నారు.
Tags :