
సుప్రీం తీర్పు చారిత్రకం:వీహెచ్
హైదరాబాద్: నేరచరిత్ర ఉన్నవారు 48 గంటలలోపు వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదొక చారిత్రక తీర్పుగా అభివర్ణించారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఇలాంటి తీర్పు మేల్కొలిపేదిగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టడం.. తర్వాత సంపాదించుకోవడం లాంటివి ఇప్పటి రాజకీయాల్లో పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. బ్యాంకు మోసాలకు పాల్పడ్డ వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలన్నారు. నేరచరిత్ర ఉన్న వారే ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు.
Tags :