అక్రమంగా మద్యం తరలింపు.. ఆరుగురిపై కేసు
logo
Published : 29/03/2020 01:35 IST

అక్రమంగా మద్యం తరలింపు.. ఆరుగురిపై కేసు

శంషాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘించి మద్యం తరలిస్తున్న ఆరుగురు కిరాణా వ్యాపారులపై శంషాబాద్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కొత్తూర్‌ మండలం, ఇన్ముల్‌నర్వాకు చెందిన ఎస్‌.రాజేందర్‌, ఎస్‌.శంకర్‌, ఎస్‌.గోపాల్‌, ఫరూఖ్‌నగర్‌కు చెందిన పి.రవి, ముచ్చింతల్‌కు చెందిన బి.శ్రీకాంత్‌, మేకలబండ తండాకు చెందిన కె.శంకర్‌ కిరాణా వ్యాపారం చేస్తున్నారు.  మద్యం తరలిస్తూ అధిక ధరలకు విక్రయించడానికి యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పాలమాకులలో మద్యం దుకాణం తెరిచిన సద్గుణరావు, చందు అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరో సంఘటనలో శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న కిరాణా దుకాణాల నిర్వాహకులపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని