మియాపూర్‌లో అధికారుల తనిఖీ
logo
Published : 29/03/2020 01:35 IST

మియాపూర్‌లో అధికారుల తనిఖీ

ఐసోలేషన్‌ కేంద్రానికి నలుగురి తరలింపు

మియాపూర్‌, న్యూస్‌టుడే: కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి మియాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బస చేసిన నేపథ్యంలో.. శనివారం అధికారులు సదరు హోటల్‌ను పరిశీలించారు. జిల్లా సహాయ వైద్యాధికారి సృజన, చందానగర్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ సుధాంషు, మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్‌ తదితరులు హోటల్‌కు చేరుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. హోటల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో హైపోక్లోరైడ్‌ రసాయనాలను చల్లించారు. రూంబాయ్స్‌, హౌస్‌కీపింగ్‌కు సంబంధించి ఏడుగురు సేవలు అందించినట్లు గుర్తించారు. అందుబాటులో ఉన్న నలుగురిని రాజేంద్రనగర్‌లోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. స్వస్థలాలకు వెళ్లిన మిగతా ముగ్గురికి సంబంధించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌లో పనిచేసిన సిబ్బందిని క్వారంటైన్‌ చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని