మద్యం దొరక్క బలవన్మరణం
logo
Published : 29/03/2020 01:35 IST

మద్యం దొరక్క బలవన్మరణం

బాలానగర్‌, న్యూస్‌టుడే: మద్యం దొరక్క వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల గణేష్‌నగర్‌కు చెందిన శ్రీను(36) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండేవాడు. కొన్నిరోజులుగా మద్యం దుకాణాలు మూసివేయడంతో ఇంట్లో పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఈ నెల 25న బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఐడీపీఎల్‌ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొన్నాడని తెలిసి బాలానగర్‌ ఎస్‌ఐ ఖలీల్‌పాషా శ్రీను కుటుంబ సభ్యులను పిలిపించి, చూపారు. ఆ మృతదేహం శ్రీనుదిగా గుర్తించారు.

షాబాద్‌:  మద్యం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై షాబాద్‌కు చెందిన సత్తయ్య(50) ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన సత్తయ్యకు కొద్దిరోజులుగా మద్యం దొరక్కపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో చున్నీతో ఉరేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని