ఆర్థిక సాయం, వస్తువుల అందజేత
logo
Published : 29/03/2020 01:35 IST

ఆర్థిక సాయం, వస్తువుల అందజేత

చేవెళ్ల, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా అండగా నిలబడతామని పలువురు ముందుకొచ్చారు. ఈ మేరకు తమకు తోచిన విధంగా సాయం అందించారు.
* ఊరెళ్ల, మొండివాగు గ్రామాల్లో చేవెళ్ల వైస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌ రూ.85వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులతో పాటు ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్‌లు అందజేశారు.
* చేవెళ్ల పట్టణంలోని రంగారెడ్డినగర్‌ వాసులు బీజాపూర్‌ జాతీయ రహదారిపై కాలిబాటన స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఆహార ప్యాకెట్‌లు, నీళ్ల సీసాల్ని అందజేసి ఆకలి తీర్చారు.
* ముడిమ్యాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలకు చెందిన మహ్మద్‌ అంజద్‌ చేవెళ్ల చుట్టు పక్కల గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున ప్యాక్‌ చేసి పంపిణీ చేశారు.
* చేవెళ్ల పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యలను పరిశీలించారు. వైఎస్‌ఆర్‌ చౌరస్తాలో పోలీసుల చెక్‌పోస్టును తనిఖీ చేసి సూచనలు చేశారు. సుబుద్దిగౌడ్‌ తయారు చేసి తీసుకొచ్చిన ఆహార పొట్లాలను పేదలకు పంచారు.
* శంకర్‌పల్లి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రాజునాయక్‌ రూ.లక్ష, ఎంపీటీసీల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్‌రెడ్డి, పర్వేద సర్పంచి అనిత, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి రూ.50వేల చొప్పున నగదు, మండలంలోని 26 గ్రామ పంచాయతీల సర్పంచులు, 13 మంది ఎంపీటీసీ సభ్యులు రూ.5వేల చొప్పున నగదు, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి రూ.15వేలు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌ రూ.10వేలు, వైస్‌ ఎంపీపీ రాములమ్మ రూ.10వేలు, మహరాజ్‌పేట్‌ ఎంపీటీసీ మల్లమ్మ రూ.10వేల చొప్పున నగదును సేకరించి ఎమ్మెల్యే యాదయ్యకు కరవు నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని