సామాజిక దూరానికి నేను రెడీ..మరి మీరు..?
logo
Updated : 29/03/2020 20:26 IST

సామాజిక దూరానికి నేను రెడీ..మరి మీరు..?

మల్లాపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఎల్ కేజి చదివే చిన్నారి ఆయాన్ సామాజిక దూరానికి నేను సిద్దం.. మరి మీరు? అంటూ అపార్ట్ మెంట్ వాసులకు సవాల్ విసురుతున్నాడు. మల్లాపూర్ డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన తోకల సత్యప్రసాద్, ప్రశాంతి దంపతుల కూమారుడు ఆయాన్ కరోనా నివారణకై సామాజిక దూరమే అస్త్రం అనే నినాదంతో పెద్దలని గడప దాటకుండా విసరిన ఛాలెంజ్ కి అపార్ట్ మెంట్ వాసుల్లో చైతన్యం రావడంతో గడపదాటడం లేదు. దేశవ్యాప్తంగా మీ కుటుంబాలను రక్షించుకోవడంతోపాటు దేశాన్ని కాపాడుకోనేందుకు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేసుకుని సామాజిక దూరానికి కట్టుబడి, కరోనా వైరస్‌ను కట్టడి చేద్దమంటున్నారు చిన్నారి తల్లిదండ్రులు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని