
కల్లుకు బానిసై మృత్యువాత
మల్కాజిగిరి: మల్కాజిగిరి ఠాణా పరిధి వాణినగర్లో నివసించే కొసన నాగరాజు యాదవ్(40) బహుళ అంతస్తుల భవనంలో కాపలాదారుగా పనిచేస్తాడు. కల్లు తాగే అలవాటుంది. అది దొరక్క ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం ఇల్లు వదిలి బయట పిచ్చిచేష్టలతో తిరుగుతూ శుక్రవారం గౌతంనగర్ రైల్వేగేట్ సమీపంలో మృతి చెందాడు.
Tags :