Published : 04/04/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖతార్‌కు 28 మెగాటన్నుల ఔషధాలు, సరకులు

శంషాబాద్‌ నుంచి ప్రయాణికుల విమానంలో తరలింపు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో ఇతర దేశాలకు అవసరమైన ఔషధాలు, అక్కడి ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను శంషాబాద్‌ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌ నుంచి ప్రయాణికుల విమానాల్లో తరలిస్తున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. తాజాగా శుక్రవారం ఇక్కడి నుంచి ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్‌ విమానంలో 28 మెగా టన్నుల ఔషధాలు, నిత్యావసరాలు, ఇతర సరకులను ఖతార్‌ రాజధాని దొహకు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేశారు. కేవలం కార్గో సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. కార్గో విమానాలు అందుబాటులో లేని పక్షంలో ప్రయాణికుల విమానాల్లో కూడా సరకులను తరలించడానికి డీజీసీఏ అనుమతించిందని విమానాశ్రయం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌జీకే.కిషోర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని